ప్రీలాన్సింగ్ అంటే స్వయం ఉపాధి. అవును, ప్రీలాన్సింగ్ పదంలో ప్రీ ఉంది కాబట్టి ఇది ఉచితం అని అనుకోవద్దు. ప్రీలాన్సింగ్ అంటే ఏదైనా ఒక పని నిమిత్తం నియమించుకొని ఆ పనికి ఎంత అయితే ఇవ్వాలో, అంత డబ్బు చెల్లించడం.
ఉదాహరణకు, మీ ఇంటికి పేయింటింగ్ వేయాలి అనుకోండి, మీరు పేయింటర్‌కి ఉద్యోగం ఇవ్వరు. ఎందుకంటే ఆ పని కొన్ని రోజుల్లో అయిపోతుంది, తరువాత పేయింటర్‌కి పని ఉండదు. నెల నెల జీతం ఇవ్వడం కూడా వృధా అవుతుంది. అలాంటప్పుడు మీరు పేయింటింగ్ వేయించుకొని ఎంత డబ్బు అయితే ఇవ్వాలో అంత డబ్బు చెల్లిస్తారు. ఇది సహజం. ఇక్కడ మనం పేయింటర్‌ని ప్రీలాన్సర్ అని అనుకోవచ్చు.
పైన పేర్కొనబడిన విధంగా ఏ రీతిగానైతే మీరు మీ పేయింటింగ్ పనిని ఒక పేయింటర్‌కి అప్పగిస్తారో, అదే విధంగా కంపెనీలు కూడా వాళ్ళ అవసరాలకు తగినట్టు ఒక ప్రత్యేక పని కోసం నియమించుకొని పని(ప్రాజెక్టు) పూర్తి అయిన తరువాత డబ్బు చెల్లిస్తారు.